నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన పథకమే అన్న క్యాంటీన్ . ఈ పధకం ద్వారా పెద్ద ప్రజలు, రోజు వారి కూలీలు , నిస్సయతా కలిగిన వారు కడుపు నిండా అన్నం తిన్నారు అంటే నమ్మక తప్పదు,. కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం కలిగించి ఎంతో మంది పేదల కడుపు నింపిన ఘనత అన్న క్యాంటీన్ అని చెప్పొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా మూసివేయడం చేసారు. కొన్ని సమయాలలో వ్యతిరేకత తట్టుకోలేక రాజన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ అది ఇంత వరకు ఎటువంటి దశకు చేరలేదు అలానే , అసలు ప్రభుత్వం దగ్గర నుండి అలంటి ఊసే లేదు. తాజాగా కడప పట్టణంలో టీడీపీ హయాంలో కట్టిన అన్న క్యాంటీన్ భవనాన్ని కూల్చి వెయ్యడం జరిగింది. కడప పట్టణంలో కూల్చేసిన అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ శ్రేణులు ప్రజాసంఘాల నేతలతో కలిసి నిరసనకి దిగారు. కూల్చివేతల సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa