ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరికొయ్యను ముద్ధాడిన భగత్ సింగ్ కి లాల్ సలాం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:54 PM

దేశానికీ స్వతంత్రం తీసుకు వచ్చే క్రమంలో ఎంతో మంది ఉద్యమకారులు , దేశ భక్తి నేతలు  తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన సంగతి తెలిసిందే. ఎంతో మంది బ్రిటిష్ వారిపై పోరాటం చేసి అసువులు బాసారు. వారిలో కొందరు వారు చేసిన పోరాటం వలన చరిత్రలో ఆలా నిలిచి పోతూనే ఉంటారు. అల్లూరి సీత రామ రాజు, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ లాంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  మనకు స్వతంత్రం తీసుకువచ్చింది ఎవరు అంటే చాల మంది గాంధీ అంటారు. కానీ ఈ సమరం వెనుక ఎన్నో బలిదానాల ప్రతిఫలం ఉందని మరువకూడదు. కేవలం 23 సంవత్సరాలకే ఉరికొయ్యల పాలు అయ్యాడు అంటే , అతని త్యాగం ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ జీవితం. అలానే, 21 సంవత్సరాలకే  ప్రాణాలు అర్పించిన సుఖ్ దేవ్ , వీరితో చావు వరకు కలిసి ప్రయాణం చేసిన  రాజ్ గురు లాంటి ఎంతో మంది త్యాగ ఫలితమే మనకు స్వాతంత్యం . ఏ  ఒక్కరో సాధించినది కాదు అది సమిష్టి కృషి. అలాంటి వీరులు చంపబడ్డ దినం మార్చి 23  కావడం గమనార్హం . ఈ సందర్భంగా యవత్తు  దేశమంతటా వీరికి నివాళులు అర్పిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa