ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షానికి, ఈదురు గాలులకు 420 హెక్టార్లలో మొక్కజొన్న పంట నష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 01:09 PM

పశ్చిమ గోదావరి జిల్లా: గోపాలపురం మండలంలో సోమవారం ఈదురుగాలులు, వర్షానికి 420 హెక్టార్లలో మొక్కజొన్న నేలకు ఒరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి బి. రాజారావు తెలిపారు. వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి మాట్లాడారు. ప్రాథమిక అంచనావేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. మండలంలో మొక్కజొన్న పంట ప్రస్తుతం కండ గట్టిపడే దశలో ఉందన్నారు. మంచి దిగుబడులు వస్తాయనుకునే తరుణంలో గాలుల వల్ల అంతా నేలకొరిగిందని తెలిపారు. దీనివల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. మండలంలో ఈ సంవత్సరం 2100 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరుగుతోందని ప్రభుత్వ మద్దతు ధర కంటే బయట ప్రస్తుతం రూ. 2200 నుంచి రూ. 2500 వరకూ కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. ఈ సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూడాలని మండల వ్యవసాయ అధికారిని రైతులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa