మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్‌లోని చకన్ పోలీస్ స్టేషన్ లాకప్ నుంచి ఓ ఖైదీ తప్పించుకున్నాడు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఖైదీ ఎలా తప్పించుకున్నాడో పోలీసులకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని మళ్లీ పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎలా పారిపోయావు అంటూ నిందితుడిని పోలీసులు ప్రశ్నించారు. అతను పోలీసులకు లైవ్ డెమో ఇచ్చాడు. ఆ ఖైదీ చాలా సన్నగా ఉండడంతో జైలు కడ్డీల మధ్య నుంచి తేలిగ్గా బయటపడ్డాడు. కొన్ని సెకన్ల వ్యవధిలో నిందితుడు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa