ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ దరలు ఇలా పైపైకి....ప్రతి రోజూ బాదుడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 06:38 PM

ప్రెటోల్ ధరలు  రోజురోజుకు ఎగబాకుతున్నాయి. నిన్న మొదలైన పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు రూ. 110కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.36కి చేరుకుంది. ఏపీలో పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటరు పెట్రోలు ధర రూ. 112.08కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa