ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక రాజకీయాలకు గుడ్ బై: చెప్పక్కనే చెప్పిన ఆజాద్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 06:41 PM

ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా చెప్పక్కనే చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఆజాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ఓ సంస్థ ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాల దిశగా అడుగులు వేయనున్నట్టు సంకేతాలిచ్చారు.  సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ, ప్రస్తుతం తనలో అదే ఆలోచన ఉన్నట్టు చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం జోరందుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa