కల్లూరు మండల పరిధిలోని కొంగనపాడు గ్రామా నికి చెందిన వ్యక్తి కోలుకోలేక మృతి చెందిన సం ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన బింగిదొడ్డి శేషన్న (56) కుమార్తె లకు పెళ్లిళ్లు చేసేందుకు పలు చోట్ల అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది ఈ నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి మంటలార్చి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్ఐ చెప్పారు. భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa