గుంతకల్లు మండల పరిధిలోని నక్కనదొడ్డి గ్రామ రహదారిపై బుధవారం సోదాలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన మధునాయక్ అను వ్యక్తిని అరెస్టు చేసి పది లీటర్ల నాటుసారా , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సిఐ మహేష్ కుమార్ తెలిపారు.
అదుపులోకి తీసుకున్న నిందితున్ని కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండు కు ఆదేశించారన్నారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాన్ని, సారా ను సీజ్ చేశామని సిఐ తెలిపారు. ఈ దాడులలో సెబ్ సిబ్బంది ఎస్ఐ చంద్రశేఖర్, పిసి లు వీరారెడ్డి, సురేష్. రంగా, ఎర్రిస్వామి పాల్గొన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa