రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచర్ల మండలంకు చెందిన మస్తాన్ కుమారుడు, జావీద్ (25) నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని సిమెంట్ లారీ మంగళవారం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆ యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa