ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యారంగ సమస్యలపై చలో విజయవాడకు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 01:59 PM

విద్యారంగ సమస్యలపై SFI పిలుపునిచ్చిన చలో విజయవాడ... తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.  SFI పిలుపుతో లెనిన్ సెంటర్ కు పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేపట్టారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఆ తర్వాత విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa