ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డా౹౹చదలవాడ సహకారంతో డాక్టర్ చదువుతున్న పుష్పారాణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 03:00 PM

మనం ఎదగడమే కాదు మనతో ఉన్నవారు కూడా ఎదగాలి అనే భావన కలిగిన వారు ఈ రోజుల్లో చాల తక్కువ అనే చెప్పాలి. సొంత ప్రయోజనాలకోసం మాత్రమే పాకులాడే స్వార్థపూరిత మనుషులు ఉన్న ఈ సమాజంలో కూడా కొంతమంది మహనీయులు ఉన్నారు అంటే నమ్మక తప్పదు. ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే .... నరసరావుపేట మండలంలో పాలపాడు గ్రామానికి చెందిన ప్రత్తి పుష్పారాణి ప్రాధమిక విద్య నుండి విద్యలో రాణిస్తూ ప్రస్తుతం డాక్టర్ కోర్సు చదువుతున్నది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు వచ్చాయి. తన పేదరికం గురించి తెలుసుకుని ఆమెను మెడిసిన్ కోర్సు చదివిస్తున్నారు అరవింద్ బాబు . స్ధానిక పట్టణంలో గల అమూల్య నర్సింగ్ హోమ్ లో గురువారం ప్రత్తి పుష్పారాణికి మెడిసిన్ ద్వితీయ సంవత్సరం అభ్యసించేందుకు ఆర్దిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా పుష్పారాణి మాట్లాడుతూ పేదరికంలో ఉన్న తనను మెడిసిన్ కోర్సు చదివిస్తున్న డా౹౹చదలవాడ అరవింద బాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.భవిష్యత్తులో తాను డాక్టర్ ని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తానని అన్నారు.ఈ విధంగా పేద విద్యావంతురాలిని మెడిసిన్ కోర్స్ చదివిస్తున్న అరవిందబాబు పట్ల  హాస్పిటల్ యాజమాన్యం,వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేసారు.  ప్రస్తుతం అరవింద్ బాబు నరసరావుపేట శాసనసభ  టీడీపీ ఇంచార్జి గ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa