నెల్లూరు జిల్లా, సంగం మండలంలోని పెరమన పంచాయతీలో పశువులు కాపరి అయిన మహిళ పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారయత్నం పాల్పడ్డాడని సంగం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పెరమణ గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిరోజు పశువులు కాపుల పొలాల్లోకి వెళ్ళేదని ఎస్ఐ తెలిపారు. శ ఆమె పశువులు కాసేందుకు వెళ్ళిన సమయంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఎస్ఐ తెలిపారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చేసరికి ఆ వ్యక్తి పరారయ్యాడని తెలిపారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa