భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి, భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ `వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష` పథకం తీసుకొచ్చారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామ కంఠాలను కూడా పక్కాగా సర్వే చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం చాలా వేగంగా ముందుకు వెళుతోందన్నారు. భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa