మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లాలో దారుణం జరిగింది. ధిమర్కేడ గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన యువకుడిని ప్రభుత్వ ఉద్యోగులు చితకబాదారు. అధికారుల వెంట ఉన్న పోలీసు కూడా బాధిత వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తీవ్రంగా స్పందించారు. యువకుడిపై దాడి చేసిన ప్రభుత్వ అధికారులను, పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa