దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్(Toll Plaza) బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.10 నుంచి 90 రూపాయల వరకు పెంచారు. పెరిగిన ఛార్జీలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
* కారు, జీపు, వ్యాన్, లైట్‌మోటర్ వాహనాలకు ఒకవైపు రూ.105, రెండో సైడ్ రూ.160, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు చెల్లించే రుసుం రూ.55, నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.3,520.
* బస్సు, ట్రాక్ ఒక వైపు రూ.355, రెండో వైపు రూ.535, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.180 పెరిగింది. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.11,915.
* త్రీ యాక్సల్, కమర్షియల్ ట్యాక్స్ వాహనాలకు ఒక వైపు రూ.390, రెండో వైపు రూ.585, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.195. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.13వేలు.
* హెవీ కస్టరుక్షన్ మెషినరీ ఒకవైపు రూ.560, రెండో వైపు రూ.840, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.280. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.18,685.
* ఓవర్సిజెడ్ వాహనాలకు ఒక వైపు 680, రెండో వైపు రూ.1025, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.340. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.22,750 పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పద్దతిలోనే టోల్ చెల్లింపులు ఇవాళ్టి నుంచి టోల్‌ప్లాజాల వద్ద వాహనాదారులు చెల్లించాల్సి ఉంటుందని టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa