ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశానికి వై.ఎస్.జగన్ ప్రధాని అవుతారు: నారాయణ స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 09:57 PM

మరో 15 ఏళ్ల తరువాత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికి ప్రధాని అవుతారని మంత్రి నారాయణస్వామి అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నేడు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దైవానుగ్రహం, ప్రజల దీవెనలు ఉన్నంత కాలం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని వెల్లడించారు.  అన్ని అంశాలు అనుకూలిస్తే జగన్ మరో 15 ఏళ్ల తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో, సీఎం జగన్ కు మరింత మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నానని నారాయణస్వామి వెల్లడించారు. త్వరలో క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుండడంపైనా డిప్యూటీ సీఎం స్పందించారు. మంత్రి పదవులపై సీఎం జగన్ నిర్ణయం శిరసావహిస్తామని చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని, పదవి ఉన్నా, లేకపోయినా జగన్ వెంటే నడుస్తామని నారాయణస్వామి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa