ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 12:04 PM

పెరిగిన కరెంటు చార్జీలు తగ్గించాలి అంటూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు , నిన్న రాష్ట్రమంతటా జనసేన నాయకులూ , కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు చేసారు. అనంతరం కలెక్టర్ ని కలిసి వినతి పత్రాలు అందచేశారు.  శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా , శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా , బండి రామకృష్ణ(RK) గారి ఆధ్వర్యంలో కృష్ణ  జిల్లా, శ్రీ ముకర్రం చాన్  ఆధ్వర్యంలో కడప జిల్లా  కేంద్రాలలో ర్యాలీలు , ధర్నాలు చేపట్టారు.  ఈ సందర్భంగా జనసేన నాయకులూ మాట్లాడుతూ... ప్రజలకు కష్టం వస్తే అక్కడ జనసేన ఉంటుంది , దానిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa