ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకి నిజం చెప్పండి అంటున్న టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 12:05 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక రాజకీయ చర్చ నడుస్తూనే  ఉంటుంది. నిన్నటి వరకు జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా వలన కొంత మంది ప్రాణాలు కోల్పోయారు అనే వార్త కలకలం రేపింది. ఇంతలో ప్రభుత్వము  కరెంటు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రకటన , ప్రజలలో  కొంత వ్యతిరేకత చూపించింది. అసలే వేసవి కాలం కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం ప్రజలకు నష్టం కలిగిస్తుంది అని ప్రతిపక్ష పార్టీల వారు  ఆరోపిస్తున్నారు. ఐతే చంద్రబాబు హయాంలో కూడా కరెంటు చార్జీలు పెంచారు అలాంటిది ఇప్పుడు  మమ్మల్ని ఇలా అనే హక్కు లేదు అని వైసీపీ నాయకులూ ఆరోపించగా , దానికి సమాధానంగా టీడీపీ నాయకులూ , ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో చెప్పిన అంశం. చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు.  ఫేక్ ఫెలోస్, ఫేక్ రాతలు ఆపి, కరెంటు చార్జీలు తగ్గించండి ప్రజలకి మేలు చెయ్యండి అని టీడీపీ నాయకులూ తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa