గుంటూరు జిల్లా, నరసరావుపేట పట్టణంలో స్థానిక 32 వార్డు నందు ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా టీడీపీ ఇంచార్జి అరవింద్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మనశాంతి కరువైనది అన్నారు. వేసవి కాలంలో ఎండలకు ప్రభుత్వాలు ప్రజలకు హాని కలగకుండా చర్యలు చేపట్టవలసింది పోయి కరెంటు కోతలకు గురి చెయ్యడం మంచి పెద్దది కాదు అన్నారు. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్భది పడుతున్న తరుణంలో , మూలిగే నక్క మీద తాటి కాయ పడినట్లు .. కరెంటు చార్జీలు పెంచడం చాల ధారణమైన విషయం అని తప్పు పట్టారు. కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన తరుణంలో ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని జగన్ రెడ్డి కల్పించారు. ఇప్పుడు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారు.అన్ని రకాలుగా జగనన్న బాదుడే బాదుడు అని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa