తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఉగాది. ఈరోజుతో మొదలయ్యే శుభకృత్ నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాలు తీసుకురావాలి. ప్రతి తెలుగు వారికి కోరుకున్న విజయాలను అందించాలి. ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శుభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రంలో జరుగునో ఈ అన్యాయమైన , దుర్మార్గపు పాలనా మారాలని తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకొంటున్నాను అని టీడీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... రాష్ట్రానికి ప్రతి రోజు పండగ వాతావరణం తీసుకువచ్చే ప్రభుత్వం త్వరలోనే రాబోతుందని ఆ దిశగా పార్టీ కార్యకర్తలు , నాయకులూ అడుగులు వెయ్యాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa