ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుపమ పరమేశ్వరన్ రాక...భారీగా తరలివచ్చిన జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 11:41 PM

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ రాకతో మచిలీపట్నం పులికించింది. టాలీవుడ్ అందాల నటి అనుపమ పరమేశ్వరన్ మచిలీపట్నం విచ్చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన కిడ్స్ వేర్ విభాగాన్ని అనుపమ ప్రారంభించారు. ఆమె రాకతో షాపింగ్ మాల్ వద్ద అభిమానులు పోటెత్తారు. ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అనుపమ బయటికి రాగానే, ఆమెను చూసి ఈలలు, కేకలతో హోరెత్తించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ అనుపమ చెప్పగా, ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. వారి ఉత్సాహాన్ని, అభిమానాన్ని చూసి అనుపమ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆస్వాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa