ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ కిలో చికెన్ రూ.800.. ఇక పెట్రోల్ అయితే..

international |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 11:10 AM

శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం ముదురుతోంది. దేశాధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తాజాగా అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ సేవలు స్తంభించాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రి దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువరించింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరెంట్ కోతలపై ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కిలో చికెన్ రూ.800లు, లీటర్ పెట్రోల్ రూ.250 ఇలా అన్ని ధరలూ ఆకాశాన్నంటుడడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా మంది భారత్‌కు శరణార్దులుగా వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa