సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత ఆధునిక సమాజంలో మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉన్నత చదువులు చదివినా కొందరు మూఢ విశ్వాసాలను పాటిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. తాజాగా జాతకదోషం కారణంగా ఓ యువకుడు చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలోని నూజివీడుకు చెందిన ఓ యువకుడికి జాతకంలో దోషం ఉందని కొందరు పురోహితులు చెప్పారు. అతడికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని జాతకంలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో దోష నివారణ కోసం మేకతో శనివారం పెళ్లి కానిచ్చేశారు. పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న నవగ్రహ ఆలయ ఆవరణలో ఈ వివాహ తంతు జరిగింది. అర్చకులు మంత్రోచ్ఛరణల మధ్య ఆ యువకుడితో మేకకు తాళి కట్టించారు. ఈ వివాహ వేడుకలో యువకుడితో పాటు అతడి అతడి తల్లిదండ్రులు, అర్చకుడు మాత్రమే ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa