మొబైల్ ఫోన్ల వల్లే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వ్యాఖ్యానించారు. ఫోన్‌లో అశ్లీల వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయని, ఇవి కొందరిలో దుర్బుద్ధిని రేపుతున్నాయని చెప్పారు. దేశంలో అత్యాచారాలు జరగడానికి ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని ఇటీవల ఓ సర్వేలో కూడా తేలిందన్నారు. కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడితే తప్పు పోలీసులది కాదని, ఆ తండ్రి చేతిలోని ఫోన్‌దని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa