మెసేజ్‌లను ఫార్వార్డింగ్ చేయడంపై వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌లో ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లను ఒక్కసారి మాత్రమే ఫార్వార్డ్ చేయాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ మేరకు వాబిటైన్‌ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్‌లలో ఈ కొత్త రూల్‌ని అమలు చేయనున్నట్లు తెలిసింది.ఒక మెసేజ్ ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లో ఇక ఫార్వర్డ్ చేయడానికి వీలుండదు. ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే తిరిగి మెసేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa