గ్రీన్ టీ వాడకం మధుమేహగ్రస్తులతోపాటు నలభై దాటిన స్త్రీలకు ఎంతో ఉపయోగకరం. గ్రీన్ టీ ని చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రిఫర్ చేస్తున్నారు. నిజానికి గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కాఫీ, టీకి బదులుగా మీరు గ్రీన్ తీసుకుంటే మంచిది. మెటబాలిజంని పెంచడంలో గ్రీన్ టీ బెస్ట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర సమస్యలను కూడా రాకుండా చూసుకుంటుంది. కాబట్టి మహిళలు గ్రీన్ టీని అలవాటు చేసుకోవడం మంచిది. మామూలు కాఫీ, టీ కి బదులుగా దీనిని తీసుకోండి. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రీన్ టీని తయారు చేసుకునేటప్పుడు సరైన ప్రాసెస్‌లో తయారు చేసుకోవాలి లేదంటే అనవసరంగా ఎటువంటి లాభం మీరు పొందలేరు. కాబట్టి రోజూ తాగే టీ కాఫీలకు బదులుగా మీరు గ్రీన్ టీని తీసుకుంటూ ఉండండి. దీనితో బరువు తగ్గించుకోవచ్చు. పైగా ఎనర్జీ లెవల్స్‌ను కూడా పెంపొందించుకోవచ్చు.