ఏ వయస్సులో ఏవి తానాలి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రోటీన్ శరీరానికి అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తప్పక తీసుకుంటూ ఉండాలి. స్త్రీలు తమ బరువులో ఒక్కో కిలో గ్రామ్ బరువుకి 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇలా కనుక తీసుకుంటే మజిల్ మాస్‌లో ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండటం కూడా చాలా ముఖ్యం. 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పని సరిగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చికెన్, టోఫు, బీన్స్, పుట్టగొడుగులు, సోయా వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని డైట్లో తరచు తీసుకునేలా చూసుకోండి ఇది కూడా మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలానే ఇబ్బందులు లేకుండా చేస్తుంది.