దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు వారాలుగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు కంపెనీలు తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.61, లీటర్ డీజిల్ ధర రూ.95.87 కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.119.67, డీజిల్ రూ.103.92కి చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.118.59, డీజిల్ రూ.104.62 కి పెరిగింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 దాటింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.120.45, డీజిల్ ధర రూ.106.16 గా ఉంది. గత 15 రోజుల్లో దేశంలో ధరలు పెరగడం ఇది 13వ సారి. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్, డీజిల్ పై దాదాపు రూ.11 వరకు పెరిగింది.