కేరళలోని కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన ఓ నవ జంట ఫొటో షూట్ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా వధువు పరిస్థితి విషమంగా ఉంది. కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక లకు మార్చి 14న వివాహం జరిగింది. నవదంపతులిద్దరూ షూట్ కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెజిల్ మరణించగా కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.