టీమిండియా చెత్త రికార్డు బద్దలైంది. దక్షిణాఫ్రికాతో ఆ దేశ గడ్డపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ దారుణంగా ఓటమి పాలైంది. 273 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలింది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో నమోదైన అత్యల్ప రికార్డు ఇదే. అంతేకాదు, ఇప్పటి వరకు టీమిండియా పేరుపై ఉన్న ఓ చెత్త రికార్డును బంగ్లాదేశ్ బద్దలుగొట్టింది. 1990లలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు డర్బన్ టెస్టులో 66 పరుగులకే కుప్పకూలింది. ఇన్నాళ్లకు ఇప్పుడా చెత్త రికార్డును బంగ్లాదేశ్ తుడిచిపెట్టేసింది.