ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 26 జిల్లాలతోపాటు మరో జిల్లా కొత్తగా అవతరించనున్నది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య 26కి చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా... ప్రభుత్వం వాటిని 26 జిల్లాలకు పెంచింది. ముఖ్యమంత్రి జగన్ నిన్న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు.
మరోవైపు, మంత్రి పేర్ని నాని ఈరోజు మరో ఆసక్తికర ప్రకటన చేశారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని గిరిజన ప్రాంతాలతో మరో జిల్లా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అన్నారు. రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని... మరో జిల్లాను కూడా ఏర్పాటు చేస్తే పాలన మరింత సులభతరమవుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa