ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో కరోనా విలయ తాండవం.. ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు

international |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 05:19 PM

చైనాలో కరోనా విలయ తాండవం చేస్తుంది. దానితో  చైనాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 16 వేల 412 కొత్త కేసులొచ్చినట్లు ప్రకటించింది చైనా ప్రభుత్వం. కరోనా మొదలైన తర్వాత వచ్చిన కేసుల్లో ఇవే అత్యధికం. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. 27 ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించింది చైనా ప్రభుత్వం. ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారే ఎక్కువగా ఉన్నారంది.

లాక్ డౌన్ విధించినా.. ఈ ప్రాంతాల్లో కేసు నమోదు కావడంతో మరింత కఠిన ఆంక్షలు విధించాలని చూస్తున్నారు అధికారులు. షాంఘైలో రెండో దశ లాక్ డౌన్ మార్చి 28 నుంచి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో 26 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యింది చైనా ప్రభుత్వం. దీంతో లాక్ డౌన్ ను పొడిగించాలనే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa