ఉక్రెయిన్‌లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధంగా కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. చిన్నారులు, మహిళలు అని కూడా చూడకుండా రష్యా సైనికులు చేస్తున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు బాంబులు వేస్తుంటే ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు.
ఈ క్రమంలో తాము చనిపోయినా తమ పిల్లలు బ్రతికి ఉండాలనే కారణంతో చిన్న పిల్లల వీపుపై ఫోన్ నంబర్, కుటుంబ వివరాలను రాస్తున్నారు. దీనికి సంబంధించి బాధితులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఫొటోను ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకొచ్చాడు. దానిని ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి, వీపుపై అలా వివరాలను రాయడం వెనుక కారణాలను వివరించాడు. కనీసం తమ పిల్లలనైనా శరణార్థులుగా బ్రతికిస్తారని అలా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రాణభయంతో బతుకులు సాగిస్తున్న ఉక్రెయిన్ ప్రజల దైన్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa