రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. భారతదేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్ నుండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత 13 రోజులుగా పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై విపక్షాలు పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో పెట్రో ధరల పెరుగుదల స్వల్పమేనని ఆయన అన్నారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 2021 మరియు మార్చి 2022 మధ్య, పెట్రోల్ ధరలు USలో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, UKలో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం మరియు స్పెయిన్‌లో 58 శాతం పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం 5 శాతం మాత్రమే పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa