భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆటకు దూరమైనా కామెంటేటర్ గా మారి ప్రేక్షకులకు చేరువగానే ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటరీ చేస్తున్న హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ జడేజా గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పటికీ ధోనీ చెన్నైకి బాధ్యత వహిస్తున్నాడని, కెప్టెన్‌గా జడేజాను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే కానీ, అతడు మరింత బాధ్యత వహించాలని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. జట్టు ఫీల్డింగ్ విషయాలపై దృష్టి సారించాల్సి ఉందని, జడేజా తన భారాన్ని తగ్గించుకుని ధోనికి బరువుని పెంచుతున్నాడని హర్భజన్ అభిప్రాయపడ్డారు. స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో హర్భజన్ సింగ్ పై వ్యాఖ్యలను చేసారు.
ఇకపోతే... ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ సడెన్‌గా తప్పుకుని, రవీంద్ర జడేజాను కొత్త కెప్టెన్గా సూచించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై జట్టు వరుసగా ఓడిపోయింది. ఇప్పుడు చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa