టిటిడి ముఖ్య నిఘా, భద్రతాధికారిగా డి. నరసింహ కిషోర్ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త సివిఎస్వో డి. నరసింహ కిషోర్‌ను పదోన్నతిపై వెళుతున్న గోపినాథ్ జెట్టి అభినందించారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తరువాత వేదపండితులు సివిఎస్వోకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు సివిఎస్వోకు శ్రీవారి చిత్రపట్టంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa