మనం మన సమాజంలో ఎన్నో వింతలు చూస్తుంటాం, వింటుంటాం. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి తొమ్మిది నెలల తర్వాత జన్మనిస్తుంటారు. ఇది అందరికి తెలిసిందే. ఈ తొమ్మిది నెలలు వారి శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. కడుపులో బిడ్డ క్రమంగా పెరుగుతుంటుంది. అలాగే గర్భంతో ఉన్న మహిళలకు వాంతులు, వికారం నడుపు నొప్పి, కాళ్లనొప్పి ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఓర్చుకుని మహిళలు బిడ్డకు జన్మనిస్తారు. అయితే ఓ మహిళ మాత్రం అనుకోకుండా తన ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. అసలు ఆమె గర్భవతి అనే విషయం తెలియకుండా ప్రసవించింది. వినడానికి వింతగా ఉన్న ఇది పచ్చి నిజం.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉండే అడ్రియన్నే గ్రేసన్ (33) ఒకరోజు కడుపులో ఉబ్బరంగా, నొప్పిగా ఉందని టాయిలెట్‌కు వెళ్లింది... అయితే ఆ సమయంలో తనకు తెలియకుండానే ప్రసవించింది. బాత్‌రూమ్ ఫ్లోర్‌పైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బిడ్డ పుట్టేంత వరకు తను గర్భవతిననే విషయం ఆమెకు తెలియదంట. పైగా ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాడు. ఆ బిడ్డ అడ్రియన్నే గ్రేసన్‌కు ఆరో సంతానం. ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. ఇలా అనుకోకుండా తమ జీవితాల్లోకి వచ్చిన పిల్లవాడికి గ్రేసన్ దపంతులు అపోలో అని పేరు పెట్టుకున్నారు.
అయితే అసలు తొమ్మిది నెలలు తనలో గర్భం దాల్చిన లక్షణాలు కనిపించలేదని గ్రేసన్ చెప్పింది. సాధారణంగా ఆ టైంలో బరువు పెరుగుతారని, తను బరువు తగ్గానని చెప్పింది. అపోలో కంటే ముందు గ్రేసన్ నలుగురి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వారు కడుపులో ఉన్నప్పుడు, చాలా సమస్యలను ఎదుర్కొన్నానని, బరువు పెరగడం, నడుమునొప్పి వంటివి అనుభవించానని గ్రేసన్ చెప్పారు. కానీ అపోలో కడుపులో ఉన్నప్పుడు తనకు అలాంటి సమస్యలేమి రాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
పైగా అపోలో కడుపులో ఉన్నప్పుడు చాలా బాగా తిన్నానని, ప్రతిరోజు ఉదయం కఠినమైన వ్యాయామాలు కూడా చేశానని అంటుంది. అలాగే రోజు వేసుకునే బట్టలే వేసుకున్నారని, బిగుతుగా ఉన్న షార్ట్స్ ధరించానని చెప్పింది. అయితే ప్రసవానికి రెండు నెలల ముందు మాత్రం కడుపు ఉబ్బరంగా ఉండేదట. తిన్న ఆహారం అరగక అలా అనిపిస్తుందని గ్రేసన్ భావించింది. కానీ తన కడుపులో బిడ్డ ఉన్నాడని తను గ్రేసన్ ఏ రోజు అనుకోలేదంట. బాత్రూమ్‌లో పుట్టిన బిడ్డను చూసి గ్రేసన్ దంపతులు ఒక్కసారిగా షాక్ అయ్యారంట. అలా ఆశ్చర్యపోయినా బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో సంతోషంగా కలిగిందని ఆ దంపతులు అన్నారు. అయితే ఈ దెబ్బకు గ్రేసన్ భర్త పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa