పిట్టలవానిపాలెం మండలం, పోతనకట్టవారిపాలెం లో శ్రీ కోదండ రామాలయం ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్. ఆయనతో పాటుబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ , రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జయప్రకాష్ నారాయణ పిట్టలవానిపాలెం మండల నాయకులు సాంబరాజు, బోలాగాని నారాయణ గుడారంకయ్య, బాపట్ల పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున చేరి స్వామి వారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa