ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకు పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:55 PM

అవహేళన చేశారని యువకుడిని హత్య చేశారు. ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా యాదమరి మండలం దళవాయిపల్లిలో జరిగిన మురళి హత్యకు సంబంధించిన వివరాలను పశ్చిమ సీఐ శ్రీనివాసరెడ్డి మంగళవారం వెల్లడించారు. 'దళవాయిపల్లికి చెందిన మురళి(22) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన బి. నగేష్‌ అతనితో పాటు పని చేసేవాడు. ఈ క్రమంలోనే మురళి నగేష్‌ను అవహేళన చేస్తూ నగేష్‌ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని సంతానం లేదని అవమానకరంగా మాట్లాడేవాడు. దీంతో వారితో పాటు పని చేసే నగేష్‌ స్నేహితుడు జయచంద్ర అలా మాట్లాడొద్దని మురళిని వారించగా, అతన్ని కూడా దుర్భాషలాడాడు. దీంతో వీరిద్దరు మురళిపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 3న రాత్రి పథకం ప్రకారం మురళికి మద్యం తాగించడానికి గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. మురళిని కత్తితో తల, మొండాన్ని వేరు చేసి పూడ్చి పెట్టారు. పూడ్చిపెట్టిన ప్రదేశంలో రక్తపు మరకలను గమనించి మురళి సోదరుడు పవన్‌, అతని బంధువులు, గ్రామస్థుల సాయంతో శవాన్ని వెలికితీశారు. పవన్‌ ఫిర్యాదు మేరకు తహసీల్దారు ఎదుట శవ పంచనామా చేసి కేసు నమోదు చేశారు. నిందితులు నగేష్‌, జయచంద్రను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని' సీఐ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa