ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాక్ ఇస్తున్నా నిమ్మకాయల ధరలు.. ఎంతంటే..?

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 08:47 PM

కిలో నిమ్మకాయల ధర రూ.400లు పలుకుతోంది. ఇదంతా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పలికే రేటు కాదు. మన దేశంలోనే నిమ్మకాయల ధర ఆకాశాన్ని అంటుతోంది. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దాహం వల్ల నిమ్మరసంతో గొంతు తడుపుకుందామనుకుంటే ధరలు షాక్ ఇస్తున్నాయి.

ముఖ్యంగా ఒక్క నిమ్మకాయ ధర రూ.30 పలుకుతోంది. దీంతో నిమ్మకాయలు ప్రస్తుతం ధనవంతుల కోసమే అన్నట్లు ధరలు మారిపోయాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో వైపు కూరగాయల ధరలు కూడా చుక్కలను అంటుతున్నాయి. తాజాగా కిలో నిమ్మకాయల ధర రూ.400లు పలకడంతో సామాన్యులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa