మండే వేసవిలో చల్లని పానీయాలను తాగాలని ఎవరు మాత్రం అనుకోకుండా ఉంటారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది శీతలపానీయాలను సేవిస్తుంటారు. అది ఎంతమాత్రమూ కరెక్ట్ కాదు. పండ్ల రసాలు, మజ్జిగ, సబ్జా వంటి వాటిని తీసుకుంటే సహజసిద్ధంగా శరీర వేడిని తగ్గించుకోవచ్చు. ఇంకా కొత్తగా ట్రై చెయ్యాలనుకుంటే పుదీనా తో ఇలా చేసి చుడండి.
ముందుగా పుదీనా ఆకులను మాత్రమే తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా ఆకులు, కొంచెం తేనె, కొంచెం నిమ్మరసం, తగినన్ని నీళ్లు, వేయించిన జీలకర్ర పొడి కొంచెం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మెత్తని మిశ్రమం నుండి ఒక స్పూన్ మాత్రమే తీసుకుని ఒక గ్లాస్ లో వేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని చల్లటి నీటిని ఆ మిశ్రమానికి జతచేసి బాగా కలుపుకోవాలి. దీంతో చల్ల చల్లని పుదీనా షర్బత్ రెడీ అవుతుంది.
వేసవిలో ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాదు.. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే జీర్ణసమస్యలకు పుదీనా షర్బత్‌తో చెక్ పెట్టవచ్చు.దీన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి మొత్తం పోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa