పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (ఉచిత రేషన్) పథకాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రశంసించింది. కరోనా కష్టకాలంలో ఇండియాలో పేదరికం పెరగకుండా ఈ పథకం ఎంతగానో దోహదపడిందని పేర్కొంది. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వారిని ఆదుకుందని కొనియాడింది. లాక్‌డౌన్ టైంలో మోదీ సర్కారు ఈ స్కీంను ప్రవేశపెట్టింది. ఒక్కో వ్యక్తికి 5 KGల బియ్యం/గోధుమలు ఇస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa