ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 07:59 AM

పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. దీంతో వాహనదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత 16 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 10 శాతం మేర పెరిగాయి. లీటరు పెట్రోల్ రేటు కొన్ని చోట్ల రూ.120 దాటింది. ఏపీ, తెలంగాణలో గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.119.47 వద్ద, డీజిల్ రేటు రూ.105.47 వద్ద ఉన్నాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.121.26 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.106.87 వద్ద కొనసాగుతోంది. విశాఖ పట్నంలో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా రూ.119.98, రూ.105.63 వద్ద ఉన్నాయి. వరంగల్‌లో లీటరు పెట్రోల్ రూ.118.97, డీజిల్ ధర రూ.105 గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa