ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంటు కోతలకు నిరసనగా విసనకర్రలు పంపిణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 11:32 AM

ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కరెంటు కోతలను ఖండిస్తూ..గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్,పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా తదితర నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మిగులు విద్యుత్ రాష్ట్రం నుండి విద్యుత్ లోటు రాష్ట్రంగా ఏపీ పరిస్థితిని దిగజార్చిన జగన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అసమర్థతల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద ఉచితంగా విసనకర్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa