ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేటలో వాలంటీర్ల సత్కార కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 11:34 AM

ప‌ల్నాడు జిల్లా కేంద్రం న‌ర‌స‌రావుపేట‌లో నేడు సీఎం వైయ‌స్  జ‌గ‌న్ వాలంటీర్ల స‌త్కార కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. వాలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో సత్కరించడంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను సీఎం అందచేస్తారు.  వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఉగాది సందర్భంగా సత్కార కార్యక్రమాలను ప్రారంభించింది. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొన‌సాగ‌నున్నాయి.  గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 2,20,993 మంది వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించగా ఈ ఏడాది 2,33,333 మందిని సత్కరించాలని నిర్ణయించింది. వాలంటీర్లను సచివాలయాలవారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిస్తారు. ఈ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో  వాలంటీర్ల  సత్కార కార్యక్రమం జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa