రాష్ట్ర రాజకీయాలలో రోజు రోజుకి పాలకుల మధ్య సహనం తగ్గుతుందేమో అనేలా ప్రవర్తిస్తున్నారు నాయకులూ. దిశా విర్ధేశం చేయవలసిన చేయవల్సిన నాయకులే ప్రజా క్షేత్రంలో బూతులు మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు ఐన జిల్లాలలో ఒకటైన పల్నాడు జిల్లా కేంద్రంగా నియమింపబడిన నరసరావుపేట నియోజక వర్గంలో జరిగిన ఉదంతం ఇది . ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులూ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలందరిలో టీడీపీ నేతలను ఎక్కువగా ఏ ఎమ్మెల్యే బూతులు తిడితే ఆ ఎమ్మెల్యేకి మంత్రిగా అవకాశం అవకాశమొస్తుందేమోనని ఆశ పడి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు చెందిన శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతల పై అనవసరంగా బూతులు తిట్టి కొడాలి నానికి ఎక్కడ తీసి పోనని నిరూపించుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతల పై బూతు పురాణాలందుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. నోటి పారుదల శాఖా మంత్రి,బూతుల శాఖా మంత్రి తరువాత మూడవ స్థానం కోసం బూతు పురాణాల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకొని ప్రజలలో చెరగని ముద్ర వేసుకోవాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరాటం తను ఒక శాసన సభ్యుడననే విషయం మరచి సభ్య సమాజం తల దించుకునే విధంగా బూతులతో చెలరేగి తనే అధికారిలా కేసు బుక్ చేస్తానంటూ టీడీపీ నేతలను బెదింపులకు గురి చేశారు అని ఆరోపిస్తున్నారు.
*పల్నాడు జిల్లా:-*
రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలందరిలో టీడీపీ నేతలను ఎక్కువగా ఏ ఎమ్మెల్యే బూతులు తిడితే ఆ ఎమ్మెల్యేకి మంత్రిగా అవకాశం అవకాశమొస్తుందేమోనని ఆశ పడి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు చెందిన శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి pic.twitter.com/fvZzXFx7Lj
— Dr.Chadalavada Aravinda Babu (@Dr_Chadalavada) April 7, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa