ఎన్టీఆర్ జిల్లా : తిరువూరులో యథేచ్ఛగా బైక్ చోరీలు. చీరాల సెంటర్ రైతు బజార్ వద్ద గత 6 నెలలుగా వరుస బైక్ చోరీలు జరుగుతున్న వైనం.పట్ట పగలు హ్యాండిల్ లాక్ చేసిన మోటార్ బైక్ లను ఎత్తుకువెళుతున్న ఆగంతకులు. పదుల సంఖ్యలో బైక్ లు చోరీకి గురయ్యినట్లు సమాచారం.కూరగాయలు కొనేందుకు రైతు బజార్ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు చాకచక్యంగా బైకులు చోరీ చేస్తున్న వైనం.బైక్ చోరీలపై స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నా ఫలితం శూన్యం అంటూ వాపోతున్న భాదితులు.రైతు బజార్ సిసి ఫుటేజ్ లో బైక్ చోరాగ్రేసరులు అక్కపాలెం రూట్ లో వెళ్లిన దృశ్యాలు వెల్లడి.తెలంగాణకు చెందిన కేటుగాళ్ళు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పలువురి అనుమానాలు.మొన్న మంగళవారం రోజున ఇదే సెంటర్ కు చెందిన ఓ టైలర్ ద్విచక్ర వాహనం చోరీ. లాక్ చేసిన వాహనాలను తమ వద్ద గల నకిలీ తాళాలతో అపహరిస్తున్న ఆగంతకులు. రైతు బజార్ సమీపంలో ని ఓ బంగారు నగల దుకాణంలో ఇటీవల తాళం పగులకొట్టి చోరీకై విఫల యత్నం.పట్టణం లోని ప్రధాన వ్యాపార కేంద్రం,నిత్యం పాదచారులు,వాహన దారులతో రద్దీగా ఉండే చీరాల సెంటర్ లో వరుస చోరీలు జరుగుతుంటే ఇక మారుమూల ప్రాంతాలు ,పల్లెల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు. రైతు బజార్ సెక్యురిటి సిబ్బంది పనితీరు పైనా విమర్శలు. విధి నిర్వహణలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు.ఇప్పటికైనా పట్టపగలు యథేచ్ఛగా జరుగుతున్న చోరీలను అరికట్టేందుకు పోలీస్ అధికారులు,రైతు బజార్ రక్షణ విభాగం సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa