ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహర్నిశలు శ్రమిస్తూ వలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:18 PM

ప్రజాసేవకు రాజకీయ అనుభవం అక్కర్లేదని.. సంకల్పం ఉంటె  చాల‌ని నిరూపించిన ఏకైన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని వైయ‌స్ఆర్‌సీపీ నరసరావుపేట నియోజక వర్గ  ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. న‌ర‌స‌రావుపేట‌లో ఏర్పాటు చేసిన వాలంటీర్ల స‌న్మాన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 700 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న ప‌ల్నాడు ప్రాంతాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుర్తించి ఇవాళ ప్ర‌త్యేక జిల్లాగా మార్చార‌ని కొనియాడారు. రాష్ట్రంలో  ప్రజాసంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే సీఎం వైయ‌స్‌ జగన్‌ లాంటి నేత రాష్ట్రానికి ఎంతో అవసరమని  చెప్పారు.  అహర్నిశలు శ్రమిస్తూ వలంటీర్లు ప్రజలకు సేవల్ని అందిస్తున్నార‌ని తెలిపారు. ఇలాంటి వాలంటీర్ల‌ను గుర్తించి వారిని స‌న్మానించ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa