దేశంలో కులాల మధ్య చిచ్చు రోజురోజుకి పెరిగిపోతుందని చెప్పాలి. కుల నిర్ములన కమిటీ అని ఎన్నో ఉన్న , కొన్ని కులాలను కొంతమంది అగ్రవర్ణాలు దూషిస్తూనే ఉన్నారు. అలానే కులాల మధ్య తారతమ్యం చూపించి ఎంతో మంది మహిళల మాన ప్రాణాలను గాలిలో కలిపిన వారు ఉన్నారు. రాజ్యంగంలో చెప్పినట్లు , వెనకబడిన కులాలకు ప్రభుత్వాలు అండగా ఉండాలి అనే నినాదంతో ప్రస్తుతం జరుగుతున్నా రాజ్య సభ సమావేశాల్లో వైసీపీ కి సంబంధించిన నాయకులూ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ... రాజ్యాంగంలోని సెక్షన్ 8 కింద వాల్మీకి, బోయ తెగలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని కోరారు. బుధవారం రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఈ అంశంపై మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa