ఈ నెల 15 న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15 న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్. పి అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కళ్యాణం రోజున ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు.
ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సిసి టివిలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారీకేడ్లు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్. పి పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏ. ఆర్ డి. ఎస్. పి రమణయ్య, కడప డి. ఎస్. పి బి. వెంకట శివారెడ్డి, ట్రాఫిక్ డి. ఎస్. పి బాలస్వామి రెడ్డి, ఎస్. బి ఇన్స్పెక్టర్ లు వెంకట కుమార్, రెడ్డెప్ప, ఆర్. ఐ మహబూబ్ బాషా, కడప వన్ టౌన్ సి. ఐ టి. వి సత్యనారాయణ, అర్బన్ సి. ఐ ఎస్. ఎం అలీ, తాలూకా సి. ఐ ఉలసయ్య, రూరల్ సి. ఐ శ్రీరామ్ శ్రీనివాస్, చిన్నచౌక్ సి. ఐ అశోక్ రెడ్డి, రిమ్స్ సి. ఐ సదాశివయ్య, ఒంటిమిట్ట సి. ఐ రాజా ప్రభాకర్, బద్వేలు రూరల్ సి. ఐ హనుమంతు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa